సీఎం రేవంత్‌ ఇంట్లో మంత్రులకు డిన్నర్ పార్టీ..!

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ నెల 30న మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పుపై నేతలకు అధిష్టానం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్‌ ఇంట్లో మంత్రులకు డిన్నర్ పార్టీ..!
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ నెల 30న మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పుపై నేతలకు అధిష్టానం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఇంట్లో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణ జరిగితే ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు స్థానచలనం ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా జూన్ మొదటి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే రాహుల్ గాంధీ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టీకాంగ్రెస్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరికి స్థానచలనం ఉంటుంది, కొత్తగా కేబినెట్‌లోకి ఎవరు రాబోతున్నారు అన్నదానిపై ఆసక్తినెలకొంది.

Next Story