- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెఈఈ మెయిన్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు జెఈఈ మెయిన్‌లో తమ ప్రతిభను కనబర్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు జెఈఈ మెయిన్‌లో తమ ప్రతిభను కనబర్చారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహంచిన జెఈఈ మెయిన్–2025 మొదటి విడత పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజేస్సీ(ఎన్టీఏ) నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సాంఘి సంక్షేమ గురుకులాల ప్రతిభ కేంద్రాలు గత సంవత్సరం కంటే మెరుగైన పర్సంటేజీలు సాధించి కార్పొరేట్కోచింగ్ సెంటర్లకు ధీటుగా తమ సత్తాను మరోసారి నిరూపించాయి. మొత్తంగా సంక్షేమ గురుకులాల ప్రతిభ కేంద్రాల నుంచి 415 మంది జెఈఈ(అడ్వాన్స్డ్) 2025 పరీక్షకు గత సంవత్సరం కట్ఆఫ్ఆధారంగా అర్హత సాధించారు. వీరిలో గౌలిదొడ్డి ప్రతిభ కేంద్రం నుంచి విద్యార్థులు అత్యధిక పర్సంటేజీలు సాధించారు. విద్యార్థులు సాధించిన విజయంతో పేదరికం అడ్డుగోడ కాదని ఆత్మవిశ్వాసంతో నిరూపించారు.
ఈ సందర్భంగా విజయాలు సాధించిన విద్యార్ధులను, అందుకు కృషి చేసిన సిబ్బంది సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీడీడీ ప్రిన్సిపాల్సెక్రటరీ ఎన్శ్రీధర్, గురుకులాల కార్యదర్శి డాక్టర్అలుగు వర్శిని ప్రత్యేకంగా అభినందించారు. అయితే, ప్రతి ప్రతిభ గురుకుల కేంద్రంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి సంస్థ తీసుకున్న నిర్ణయాలతో మంచి ఫలితాలు సాధించడం జరిగిందని తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ పేర్కొన్నది. ముఖ్యంగా బదిలీల ద్వారా అనుభవజ్ఞులైన ప్రధానాచార్యులను, నిష్టాతులైన బోధనా సిబ్బందిని నియమించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే, మైక్రో – షెడ్యూల్‌ని పటిష్టంగా అమలు పర్చడం జరిగిందన్నారు.
లక్ష్యానికి అనుగుణంగా నిరంతరం పర్యవేక్షణతోపాటు వారాంతపు, మాక్పరీక్షలు నిర్వహించడం, ప్రతి విద్యార్థికి అనుగుణంగా కౌన్సిలింగ్ ఇవ్వడం ఫలితాలు సాధించడంలో ఎంతో దోహదపడిందన్నారు. 2025 ఏపరల్ మొదటి వారంలో జరగబోయే జెఈఈ మెయిన్ రెండ విడత పరీక్షలో మరింత మంది విద్యార్థులు అత్యధిక పర్సంటేజీ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు పరుచడం జరుగుతుందని గురుకులాల కార్యదర్శి డాక్టర్అలుగు వర్శిని తెలిపారు.
అత్యత్తుమ పర్సంటేజీలు సాధించిన స్టూడెంట్స్..
ఆర్.మణిదీప్–99.03
కె. చరణ్‌రాజ్–98.30
డి.తేజస్వీని–98.267
పావ్శ్రీనివాస్– 96.88
జె.రామచరణ్‌తేజ – 96.78
ఎం.భవ్యశ్రీ– 95.75
భానుతేజ – 95.49
సుజల – 95.49
కె.చరణ్‌తేజ్– 95.20
కె. కీర్తన –95.07
పర్సంటేజీ సాధించిన విద్యార్థులు..
90కిపైగా పర్సంటేజీ సాధించిన విద్యార్థులు – 28
80-90 పర్సంటేజీ మధ్య సాధించిన విద్యార్థులు– 111
70-80 పర్సంటేజీల మధ్య సాధించిన విద్యార్థులు – 128
60-70 పర్సంటేజీల మధ్య సాధించిన విద్యార్థులు – 168






