- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నా.. CM రేవంత్ ప్రకటన
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా పలువురు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భారత్ సమ్మిట్‌కు విచ్చేసిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదించారు.ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలన్నారు.
కశ్మీర్‌లో పర్యాటకులపై దాడి చేసి చంపేయడం తీవ్రమైన ఘటన అని అన్నారు. ఇతరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తూ తీవ్రవాదాన్ని అంతం చేయాలన్నారు. అంతా ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది ప్రజలు ప్రధాని వెంట ఉంటారని చెప్పారు.
ఈ విషయంలో మోడీ(PM Modi)కి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 1971లో పాకిస్థాన్‌ను ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని, ఆనాడు ఇందిరాగాంధీ(Indira Gandhi)ని దుర్గామాతతో వాజ్పేయ్పోల్చారని పేర్కొన్నారు. మరోసారి పాకిస్థాన్‌ను ఓడించాలి అని అన్నారు. పీవోకేను భారత్‌ను కలపాలి, ఇందిరాగాంధీని గుర్తుకుతెచ్చుకొని పాకిస్తాన్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న భారత్‌పై ఉగ్రదాడి జరిగిందని, పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరు చేయాలన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలి అని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌చేశారు.
జమ్ము కాశ్మీర్ లోని పహెల్గామ్ లో …
— Revanth Reddy (@revanth_anumula) April 25, 2025
ఉగ్రవాదుల దుశ్చర్యలో
ప్రాణాలు పోగొట్టుకున్న
అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని…
రాజకీయాలకు అతీతంగా…
పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఉగ్రవాద దుశ్చర్యకు వ్యతిరేకంగా…
ముష్కరులను… pic.twitter.com/olR8FCXgRj






