- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ayudha Puja: దేశాన్ని కాపాడే ఆయుధం ఏదైనా దైవస్వరూపమే.. సీఎం, మంత్రుల ఆయుధ పూజ
దేశవ్యాప్తంగా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ మేరకు గురువారం విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆయుధ పూజ నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా (Dasara festival) దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ మేరకు విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు ఆయుధ పూజ (Ayudha Puja) నిర్వహించారు. విజయదశమి సందర్భంగా నా స్వగృహంలో నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్నట్లు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు షేర్ చేశారు. అలాగే విజయదశమి సందర్భంగా హైదరాబాద్ లోని నివాసంలో కుటుంబ సమేతంగా ఆయుధ పూజ నిర్వహించినట్లు ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు.
ఈ ఆయుధ పూజ వెనుక ఒక గొప్ప సందేశం ఉందని, మనకు ఆహారం అందించే హలం, మనం ప్రయాణించే వాహనం, దేశాన్ని కాపాడే ఆయుధం సాధనం ఏదైనా అది దైవస్వరూపమే.. అని తెలిపారు. అర్జునుడు వనవాసంలో దాచిన తన ఆయుధాలను విజయదశమి రోజునే తిరిగి పొందారని, అందుకే ఈ రోజు విజయం, శౌర్యం, ధర్మయుద్ధం ప్రతీకగా నిలిచిందని చరిత్ర మనకు తెలియజేస్తోందని తెలిపారు. దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లుతూ, అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి పొంగులేటి కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.






