- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గల్ఫ్‌లో తెలుగు వారికి అలర్ట్.. భద్రతే లక్ష్యంగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలన..
ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్తోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.






