CM Revanth Reddy: కాసేపట్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన.. పలువురు హౌజ్ అరెస్ట్

by Kema Shiva Kumar |

ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) నూతన భవనానికి సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో గోషామహల్‌ స్టేడియం (Goshamahal Stadium)లో శంకుస్థాపన చేయనున్నారు.

CM Revanth Reddy: కాసేపట్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన.. పలువురు హౌజ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) నూతన భవనానికి సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో గోషామహల్‌ స్టేడియం (Goshamahal Stadium)లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రతి విభాగంలో ఒక్కో ఆపరేషన్‌ థియేటర్‌, ఆధునిక సదుపాయాలతో ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఆదేవిధంగా ఆస్పత్రి భవనం నమూనా చిత్రాన్ని గురువారం విడుదల చేశారు. గత వందేళ్లుగా తెలంగాణ (Telangana)తో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), పొరుగున ఉన్న మహారాష్ట్ర (Maharashtra), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా నూతన ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్‌గంజ్‌ (Afzalgunj)లో ఉండగా.. నూతన ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో 2 వేల పడకల సామర్ధ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించబోతున్నారు.

కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తగ్గకుండా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు నూతన ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా.. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవ‌లు, ప్రతి విభాగినికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన చేశారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగంణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చే వారు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు నిర్మించనున్నారు.

పలువురు హౌజ్ అరెస్ట్..

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. గోషామహల్ పరిరక్షణా సమితి బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఆసుపత్రి నిర్మాణం మంచిదే.. కానీ గోషామహల్ సరికాదని అన్నారు.

Next Story