- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: వైభవోపేతంగా రాములోరి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ దంపతులు
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం (Bhadrachalam)లో అభిజిత్ సుముహుర్తమున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అశేష భక్త జనులతో మిథిలా స్టేడియం (Mithila Stadium) రామనామ స్మరణతో మారుమోగుతోంది పోటెత్తింది. ఈ క్రమంలోనే రాములోరి కల్యాణోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ఆయన సతీమణి గీత (Geetha)తో కలిసి హాజరయ్యారు. అనంతరం స్వామి వారికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వేద పండితులకు అందజేశారు.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరుఫున చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణోత్సవానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) దంపతులు, సీఎస్ శాంతికుమారి (CS Shanthi Kumari) దంపతులు హాజరయ్యారు. కాగా, అంతకు ముందు ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారిని దర్శించుకుని వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ మేరకు సీఎం దంపతులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సరేఖ (Konda Suresh), సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్వి శైలజా రామయ్యార్ (Shailaja Ramaiyar) పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.






