HYD: బోనాల్లో ఉత్సవాల్లో పాల్గొన్న CM రేవంత్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు.

HYD: బోనాల్లో ఉత్సవాల్లో పాల్గొన్న CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి(Ujjaini Mahakali Temple) పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి కొండా సురేఖతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు. కాగా, ఆదివారం ఉదయం 4 గంటల నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలిపూజ చేసి బోనం సమర్పించారు. ఆ తర్వాత సాధారణ భక్తులకు అమ్మవారిని దర్శించుకునే ఇచ్చారు. ఉదయం 11.00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొనే బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో రెండు క్యూలైన్లు బోనాలతో వచ్చే మహిళల కోసం, ఒకటి వీఐపీ పాస్‌లతో వచ్చే వారికి, మిగతావి సాధారణ భక్తులకు కేటాయించారు.

Next Story