- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2025’ ఆర్థిక సదస్సుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయంలోపు అన్ని పనులు పూర్తిచేసి డ్రై రన్ నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్‌కు 2 వేల మంది దేశ, విదేశీ అతిథులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 4,800 మంది అంతర్జాతీయ ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమ్మిట్ ఏర్పాట్లపై ఏరియల్ సర్వే నిర్వహించారు. తన సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ఏరియల్ సర్వే ద్వారా సదస్సు జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా, ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ సెమీ కండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. ఏరియల్ సర్వే ఇదే..






