- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రులతో సీఎం.. మరికాసేపట్లో మీడియా ముందుకు రేవంత్ రెడ్డి
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బయ్యారం గ్రీన్ స్టీల్ ప్లాంట్, ఈవీ పరిశ్రమల స్థాపనపై కీలక విజ్ఞప్తులు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఉదయం కేంద్ర మంత్రులు, కుమార స్వామి, శ్రీనివాసవర్మను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజిగ్ 2047 విజన్ లో రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సీఎం మంత్రులకు వివరించారు. బయ్యారం గ్రీన్ స్టీల్ ఫ్లాంట్‍ను (Bayyaram Steel Plant) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కరొత తగ్గడం, పర్యావరణానికి మేలు జరుగుతోందన్నారు. పాత వాహనాల స్క్రాప్ తో ఉక్కును రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. మెషిన్ టూర్స్, రోబోటిక్స్ పరికరాల తయారీకి ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయాలని 2034 నాటికి హైదరాబాద్ ను కాలుష్యం లేని నగరంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలన్నారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ వేదికగా సీఎం మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. నిన్న లోక్‍సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.






