జపాన్‌ కిటాక్యూషు మేయర్‌ బృందంతో సీఎం రేవంత్ భేటీ

by Ajay Maddhiboyina |

తెలంగాణ ఆవిర్బావ దీనోత్సవం సంద‌ర్భంగా ప‌రేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జపాన్ కిటాక్యూషు మేయర్ కజుహిసా టక్యూచీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జపాన్‌ కిటాక్యూషు మేయర్‌ బృందంతో సీఎం రేవంత్ భేటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ ఆవిర్బావ దీనోత్సవం సంద‌ర్భంగా ప‌రేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జపాన్ కిటాక్యూషు మేయర్ కజుహిసా టక్యూచీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ, కిటాక్యూషు మధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కార ఒప్పందం స‌మ్మిళిత ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రియు ప‌ట్ట‌ణ ఆవిష్క‌ర‌ణ‌ల‌లో స‌హకారానికి పునాది అవుతుంద‌ని అన్నారు. హైదరాబాద్ కిటాక్యూషు మధ్య విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కిటాక్యూషులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జపాన్‌తో ఎకో టౌన్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి.

Next Story