నిర్మలా సీతారామన్‌తో CM రేవంత్ భేటీ.. ఆ రెండు అంశాలపై కీలక అభ్యర్థనలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 10:50:54  IST  )

ప్రస్తుతం ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్టి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)తో భేటీ అయ్యారు.

నిర్మలా సీతారామన్‌తో CM రేవంత్ భేటీ.. ఆ రెండు అంశాలపై కీలక అభ్యర్థనలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రస్తుతం ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్టి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల తెలంగాణ (Telangana)లో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదకను కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌కు అందజేశారు. అనుకోని విపత్తుతో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతోన్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (Integrated schools) ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి, నిర్మలా సీతారామన్‌కు వివరించారు. వాటి నిర్మాణానికి కేంద్రం నుంచి కూడా నిధులు మంజూరు చేయాలని కోరినట్లుగా సమాచారం. కాగా, అంతకు ముందు పార్లమెంట్‌లో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Next Story