రాజ్‌నాథ్ సింగ్‌తో CM రేవంత్ భేటీ.. రక్షణ శాఖ భూములపై కీలక అభ్యర్థన

by Kema Shiva Kumar |

హస్తిన (Delhi) పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు.

రాజ్‌నాథ్ సింగ్‌తో CM రేవంత్ భేటీ.. రక్షణ శాఖ భూములపై కీలక అభ్యర్థన
X

దిశ, వెబ్‌డెస్క్: హస్తిన (Delhi) పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోన్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు 98.20 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బ‌ద‌లాయించాల‌ని సీఎం కోరారు. మూసీ, ఈసీ న‌దుల సంగ‌మం స‌మీపంలో గాంధీ స‌ర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేప‌ట్టనున్నట్లు ఆయన రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. జాతీయ స‌మైక్యత‌, గాంధేయ విలువ‌ల‌కు సంకేతంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ నిలుస్తుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story