నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, న్యాయ నిపుణులు

by Ajay Maddhiboyina |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నేడు కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మంత్రులు, న్యాయ నిపుణులు ఈ స‌మావేశానికి హాజ‌రుకానున్నారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల జీవోను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై వినిపించాల్సిన వాద‌న‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేయ‌నున్నారు.

నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, న్యాయ నిపుణులు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నేడు కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మంత్రులు, న్యాయ నిపుణులు ఈ స‌మావేశానికి హాజ‌రుకానున్నారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల జీవోను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై వినిపించాల్సిన వాద‌న‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేయ‌నున్నారు. రేపు బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రుగనుంది.

ఇక ఇదే స‌మావేశంలో ఇంచార్జ్ మంత్రులు, కార్పోరేష‌న్ చైర్మ‌న్లకు సైతం రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ ఉపఎన్నిక‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల గురించి దిశానిర్దేశం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇక నేడే జూబ్లిహిల్స్ ఉపఎన్నిక‌ల కాంగ్రెస్ అభ్య‌ర్థిపై కూడా క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్, మీనాక్షి న‌ట‌రాజ‌న్ తో ఉపఎన్నిక‌పై సీఎం చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఈ అంశం కూడా కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Next Story