- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: అట్టహాసంగా రాములోరి కళ్యాణం.. కాసేపట్లో భద్రాద్రికి సతీసమేతంగా సీఎం రేవంత్
శ్రీరామ నవమి (Srirama Navami) పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సతీసమేతంగా భద్రాచలం (Bhadrachalam) వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి (Srirama Navami) పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సతీసమేతంగా భద్రాచలం (Bhadrachalam) వెళ్లనున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లోని తన నివాసం నుంచి ఉదయం 8.45 గంటలకు బయలుదేరి 10 గంటలకు బూర్గంపాడు (Burgampadu) మండల పరిధిలోని ఐటీసీ సారపాక (ITC Sarapaka) హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడు ఉన్న అతిథి గృహం బసచేసి అక్కడ నుంచి 10.30 గంటలకు భద్రాచలం బయలుదేరనున్నారు. 11 గంటల వరకు భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 11.10 గంటల నుంచి 12.30 గంటల వరకు మిథిలా స్టేడియం (Mithila Stadium)లో సీతారాముల కల్యాణంలో పాల్గొని స్వామికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. 12.30 గంటలకు భద్రాచలం నుంచి సారపాక (Sarapaka)కు వెళ్లి అక్కడ సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మంత్రులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. తిరిగి సీఎం 1.10 గంటలకు ఐటీసీ గెస్ట్ హౌస్ (ITC Guest House)కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరిగి హైదరాబాద్ (Hyderabad)కు చేరుకుంటారు.
కాగా, సీఎం వెంట పలువురు మంత్రులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. అందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పహారా కాస్తున్నారు.






