- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిస్ వరల్డ్-2025 : అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
మిస్ వరల్డ్ -2025 (Miss World 2025) పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: మిస్ వరల్డ్ -2025 (Miss World 2025) పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. మే7వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకూ హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి అవాంతరాలు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ పోర్టులు, అతిథులు బస చేసే హోటళ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మే10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో (Gachibowli Indore Stadium) అందాలపోటీలు ప్రారంభం కానుండగా.. 12న బుద్ధభవన్ లో ఆధ్యాత్మిక పర్యటన ఉంటుంది. 13న చౌమహల్లా ప్యాలెస్ లో అతిథులకు ప్రభుత్వం వెల్కమ్ డిన్నర్ ఇవ్వనుంది.






