- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందెశ్రీ మృతిపై సీఎం రేవంత్ దిగ్బ్రాంతి
ప్రముఖ రచయిత, కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి స్పందిస్తూ.. దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ రచయిత, కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ (64) ఈ రోజు అకస్మాత్తుగా కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఉండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆయనను పరీక్షించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ షాకింగ్ వార్తను విన్న సాహితీ లోకం ఒక్కసారిగా విషాదం లోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ మరణ వార్త తెలిసిన వెంటనే స్పందించి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అందె శ్రీ తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీ తో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలింది అంటూ.. ఆయన మరణం పట్ల సీఎం సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఈ విషాద సమయంలో అందెశ్రీ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
READ MORE .....






