రామంతాపూర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-18 09:51:17  IST  )

రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విషాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి చెందారు.

రామంతాపూర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని రామంతాపూర్ లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో (Krishnashtami Celebrations) ఐదుగురు యువకులు కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి చెందారు. గోకుల్ నగర్ దగ్గర రథం లాగుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ (34), రుద్రవికాస్ (39), రాజేంద్ర రెడ్డి (39) మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారికి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

Next Story