ట్రాఫిక్ జామ్‍పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. త్వరలో ప్రత్యేక ట్రాఫిక్ బ్యూరో‍!

by Prasad Jukanti |   (  Updated:2026-05-06 11:13:33  IST  )

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ట్రాఫిక్ నియంత్రణకు కొత్తగా 'ట్రాఫిక్ బ్యూరో' ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ సి.వి. ఆనంద్ వెల్లడి.

ట్రాఫిక్ జామ్‍పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. త్వరలో ప్రత్యేక ట్రాఫిక్ బ్యూరో‍!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అయితే తన ఢిల్లీ టూర్ సందర్భంగా విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ జామ్‍పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని స్పష్టం చేశారు. ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ఇబ్బంది పెట్టొద్దని డీజీపీ సీ.వి ఆనంద్‍కు సీఎం సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు ఈ సందర్భంగా డీజీపీ పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం త్వరలో ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో సింగిల్ లైన్ లో వాహనాలు పంపాలని, ఎయిర్ పోర్టు పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు డీజీపీ ఆదేశించారు.

Next Story