- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శారదాపీఠం భూములపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా కోకాపేటలోని శారదాపీఠం భూముల అంశంపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా భూములు పీఠానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జలమండలికి చేసిన కేటాయింపులు రద్దు చేశారు. సరైన సమాచారం ఇవ్వలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి వివరాలు ఇవ్వాలని పీఠం ప్రతినిధులకు సూచించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో విశాఖ శ్రీశారదా పీఠానికి 2019లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో సుమారు రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూపాయికే కట్టబెట్టడంపై ఆ సమయంలో చర్చలు నడిచాయి. ఈ భూమి కేటాయింపు పీఠం యొక్క ఆధ్యాత్మికసాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం జరిగిందని.. ఇది వారి వినతి మేరకు జరిగిన నిర్ణయమని నివేదికలు చెబుతున్నాయి.
కాకినాడ పేలుడు ఘటనపై దిగ్భ్రాంతి
అనంతరం కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పేలుడు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 21 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.






