సీఎం రేవంత్‌కు మతి భ్రమించింది.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

by Kema Shiva Kumar |

కేరళ ఎన్నికల ప్రచారంలో పినరయి విజయన్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తప్పుబట్టారు.

సీఎం రేవంత్‌కు మతి భ్రమించింది.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శోచనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. పినరయి విజయన్‌కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని, ‘మోదీ - విజయన్ బ్రదర్స్’ అని రేవంత్ రెడ్డి అనడం ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారనడానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడు ఆయనను ‘పెద్దన్న’ అని పొగిడిన సీఎం, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ‘మోదీ - విజయన్ బ్రదర్స్’ అని మాట్లాడటం చూస్తుంటే.. ఆయన అపరిచితుడిలా మారి మాట్లాడుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు.

‘కేరళ రాష్ట్రం సామాజిక న్యాయం, మత సామరస్యం, సంక్షేమ పథకాల అమలు, విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాల కల్పనలో దేశంలోనే ముందు వరుసలో ఉంది. అక్కడి ప్రజలు ఎల్‌డీఎఫ్ (LDF) కు అండగా నిలబడుతున్నారు. మతోన్మాద శక్తులతో పాటు, దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) పార్టీని కేరళ ప్రజలు ఈసారి కూడా ఓడిస్తారని ఆశిస్తున్నాం’ అని వెస్లీ అన్నారు.

Next Story