బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మాచారం బయలుదేరిన సీఎం రేవంత్‌

by Kema Shiva Kumar |

నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం సరిగ్గా 11.20కి బేగంపేట విమానాశ్రయం నుంచి అమ్రాబాద్ మండల పరిధిలోని మాచారం గ్రామానికి బయలుదేరారు.

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మాచారం బయలుదేరిన సీఎం రేవంత్‌
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం సరిగ్గా 11.20కి బేగంపేట విమానాశ్రయం నుంచి అమ్రాబాద్ మండల పరిధిలోని మాచారం గ్రామానికి హెలికాప్టర్‌‌లో బయలుదేరారు. ఈ మేరకు ఆయన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా వెళ్లారు. గిరిజన రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కొత్త పథకానికి మాచారం వేదికగా శ్రీకారం చుట్టబోతోంది. సుమారు రూ.12,600 కోట్ల బడ్జెట్‌తో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ (Indira Soura Giri Jala Vikasam) పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అనంతరం గిరిజన రైతులను ఆయన సోలాల్ పంపుసెట్ల (Solar Pumpset)ను పంపిణీ చేయనున్నారు. ఇందులో ఒక్కో యూనిట్‌పై రూ.6 లక్షల మేర వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులు బెనిఫిట్ పొందనున్నారు.

Next Story