- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలేజీల బంద్ పై మరోసారి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రైవేట్ కాజీల బంద్ పై సీఎం రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను బెదిరించడానికే కాలేజీలను బంద్ చేశారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ కాజీల బంద్ పై సీఎం రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను బెదిరించడానికే కాలేజీలను బంద్ చేశారని అన్నారు. ఆరు నెలల పాటు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు. విద్య వ్యాపారం కాదని.. సేవ అని అన్నారు. ఫీజులు ఇస్తారా లేదా అని బంద్ చేయించి బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంతాలు, పట్టింపులకు పోతే సమస్య పరిష్కారం కాదన్నారు. రూల్స్ ప్రకారం వెళదామంటే చెప్పండి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. 100 శాతం రూల్స్ పాటించే కాలేజీలకు తక్షణమే బకాయిలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఇటీవల కూడా సీఎం నిరసన చేస్తున్న కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే ఉపముఖ్యమంత్రితో కాలేజీ యాజమాన్యాలు చర్చలు జరపగా సఫలం అయ్యాయి. దాంతో తిరిగి కాలేజీలను ప్రారంభించారు.
READ MORE .....
నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్.. కాంగ్రెస్ పాలసీలే కారణం : సీఎం రేవంత్ రెడ్డి






