- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: రాహుల్ లేఖపై స్పందించిన సీఎం రేవంత్.. ఎమోషనల్ కామెంట్స్
రాష్ట్రంలో ‘రోహిత్ వేముల’ (Rohith Vemula Act) చట్టాన్ని తీసుకురావాలంటూ సోమవారం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ‘రోహిత్ వేముల’ (Rohith Vemula Act) చట్టాన్ని తీసుకురావాలంటూ సోమవారం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాంటి ఆత్మహత్యలను ఆపాల్సిన అవసరం ఎంతగానో ఉందని.. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం రేవంత్‌ను రాహుల్ గాంధీ లేఖలో కోరారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొంటున్న వివక్ష మరెవరికి ఎదురవకుండా చట్టాన్ని రూపొందించాలని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ఎక్స్ వేదికగా రాహుల్‌గాంధీ లేఖను విడుదల చేశారు.
ఈ క్రమంలోనే జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ లేఖపై ‘X’ వేదికగా స్పందించారు. జపాన్‌లోని హిరోషిమా చారిత్రక నగరంలో తాను రాహుల్ రాసిన లేఖను చదివానని అన్నారు. అదృష్టవశాత్తూ, తాను అక్కడే మహాత్మా గాంధీజీ విగ్రహం ఉన్న పవిత్ర స్థలాన్ని సందర్శించబోతున్నప్పుడే అది జరిగిందని పేర్కొన్నారు. రాహుల్ స్ఫూర్తిదాయకమైన పిలుపు తనకు బలంగా తాకిందని.. గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో మీ ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్తాం’ అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.






