CM Revanth: హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

by Shiva |   ( Updated:2025-01-24 04:21:27.0  )
CM Revanth: హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
X

దిశ, వెబ్‌డెస్క్/శంషాబాద్: దావోస్ (Davos) వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొని హైదరాబాద్‌ (Hyderabad)కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport)లో కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్ రెడ్డి‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సక్సెస్‌ఫుల్‌గా దావోస్ (Davos), సింగపూర్ (Singapore) పర్యటనలను ముగించుకుని దుబాయ్ మీదుగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు.

కాగా, దావోస్‌ (Davos)లో మూడు రోజుల పాటు నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి అండ్ టీమ్ మొత్తంగా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా.. ఈ సారి నాలుగు రెట్లకు మించి రావడం విశేషం. ఈ టూర్‌లో మొత్తంగా 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు (MOU)లు చేసుకుంది. ఐటీ (IT), ఏఐ (AI), ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది. ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 49,500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

Advertisement

Next Story