CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ పెద్దలతో ఆ అంశాలపై కీలక భేటీ!

by Kema Shiva Kumar |   (  Updated:2024-11-12 02:17:46  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ హస్తినకు బయలుదేరనున్నారు.

CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ పెద్దలతో ఆ అంశాలపై కీలక భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ హస్తినకు బయలుదేరనున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ (Delhi)లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించే సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఏఐసీసీ (AICC) ముఖ్య నేతలతో భేటీ అయి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర (Maharastra), ఝార్ఖండ్ (Jharkhand) ఎన్నికల్లో వ్యవహరించాల్సి వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుండటంతో సీఎం రేవంత్‌‌ రెడ్డి (CM Revanth Reddy) టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపుతారనే అంశంపై అటు పార్టీలోనూ.. ఇటు ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ (Cabinet Expansion)పై చర్చ జరిగే అవకాశం ఉంది.

Next Story