- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న CM రేవంత్.. కాసేపట్లో ఢిల్లీకి పయనం
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ (Delhi) పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)కు చేరుకున్నారు. రేపు దేశ రాజధాని ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హస్తిన టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటింగ్ సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Next Story






