బస్సులో వెళ్లి సినిమా చూసిన CM రేవంత్, మంత్రులు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షించారు.

బస్సులో వెళ్లి సినిమా చూసిన CM రేవంత్, మంత్రులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రులతో కలిసి బస్సులో ప్రసాద్ ల్యాబ్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సినిమాను వీక్షించిన అనంతరం మాట్లాడారు. జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రీబాయి పూలే సమాజం కోసం చేసిన త్యాగాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించిందని కొనియాడారు. దర్శకుడు అనంత్ మహదేవన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశ్నించారు. పూలే పాత్రలో ప్రతీక్ గాంధీ, సావిత్రీబాయి సావిత్రీబాయి పాత్రలో పత్రలేఖ పాల్ నటించారు. వీరిద్దరి నటన చిత్రానికి హైలెట్‌గా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. హిందీ భాషలో రూపొందిన ఈ చిత్రం 2025 ఏప్రిల్ 25న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులోనూ అనువదించారు. సీఎం, మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ‘పూలే’ చిత్రాన్ని వీక్షించారు.

Next Story