- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతాబాయి కుటుంబానికి తోడ్పాటు.. స్పందించిన సీఎం
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన 81 సంవత్సరాల వృద్ధురాలు సబ్బని శాంతాబాయి,

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జూలై 06: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన 81 సంవత్సరాల వృద్ధురాలు సబ్బని శాంతాబాయి, ఆమె ముగ్గురు కుమారులు చంద్రమోహన్, హరిచరణ్, సాయిరాంలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి వారు కోరిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. పుట్టుకతోనే అంధులుగా జన్మించిన ముగ్గురు కుమారులకు సపర్యలు చేయడానికి వృద్ధురాలు శాంతాబాయి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి మానవీయ కోణంలో స్పందిస్తూ, శాంతాబాయి కుటుంబానికి అవసరమైన తోడ్పాటును అందించాల్సిందిగా ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని జిల్లా అధికారులతో కూడిన బృందం ఆదివారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారని అన్నారు. ప్రభుత్వం తరపున శాంతాబాయికి వృద్ధాప్య పెన్షన్, ఆమె ముగ్గురు కుమారులకు దివ్యాంగుల పెన్షన్ వస్తోందని వెల్లడించారు.






