Singareni Collieries : సీఎంకు రూ.88.55 కోట్ల సింగరేణి కాలరీస్ డివిడెండ్ చెక్కు

by Y. Venkata Narasimha Reddy |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రాష్ట్ర ప్రభుత్వానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.88.55 కోట్లు డివిడెండ్(Dividend) ను సింగరేణి కాలరీస్ చెల్లించింది.

Singareni Collieries : సీఎంకు రూ.88.55 కోట్ల సింగరేణి కాలరీస్ డివిడెండ్ చెక్కు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రాష్ట్ర ప్రభుత్వానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.88.55 కోట్లు డివిడెండ్(Dividend) ను సింగరేణి కాలరీస్ చెల్లించింది. డివిడెండ్ చెక్కును సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. సింగరేణి కాలరీస్ చెల్లింపు మూలధనం(పెయిడ్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్) లో 10శాతాన్ని డివిడెండ్ గా చెల్లించాలని నిర్ణయించారు.

ఈ మొత్తం దాదాపుగా రూ.173కోట్లకుగాను సింగరేణిలో 51శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.88.55కోట్లు డివిడెండ్ గా చెల్లించారు. సింగరేణి సంస్థ కార్మికులకు లాభాల వాటా చెల్లించడమే కాకుండా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి డివిడెండ్ లు చెల్లించడంపై రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు అభినందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలు పాల్గొన్నారు.

Next Story