- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్ష నాయకుడు శుక్రాచార్యుడిగా ఉండి ఫామ్ హౌస్ లో ఉంటూ బావబామ్మర్ది ముసుగులో మారీచుడు, సుబాహుడిని ప్రాజెక్టులను అడ్డుకోమని పంపుతున్నాడని సీఎం దుయ్యబట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉందా అని మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఉద్ధండాపూర్ రైతులకు పరిహారం ఇచ్చి భూసేకరణ చేశారా అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ సీఎం కావడం వారికి కడుపుమంటగా ఉందని అందుకే తాను ఆదిలాబాద్ జిల్లాలో చనాకా-కొరాటా పంప్‌హౌస్, సదర్మాట్ బ్యారేజీ ప్రారంభిస్తే తాము సిద్ధం చేసిందాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని ఓ మారీచుడు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. దేవలు యజ్ఞాలు, యాగాలు చేస్తుంటే వాటిని శుక్రాచార్యుడి శిష్యులు మారీచుడు, సుబాహుడు అడ్డుతగిలినట్లు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు శుక్రాచార్యుడిగా ఉండి ఫామ్ హౌస్ లో ఉంటూ బావబామ్మర్ది ముసుగులో మారీచుడు, సుబాహుడిని ప్రాజెక్టులను అడ్డుకోమని పంపుతున్నాడని దుయ్యబట్టారు. మారీచుడు మాయలేడీ రూపంలో వస్తే రాముడి బాణానికి బలైనట్లు ఇలాంటి రాక్షసులను కట్టిపడేసే శక్తి పాలమూరు బిడ్డకు ఉందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్లను, మనవాళ్లను గెలిపించాలన్నారు. మంత్రులతో కలిసి పని చేసేవారిని గెలిపించుకోవాలని సూచించారు.
దెబ్బకు దెబ్బ తీయడము తెలుసు
మాకు వ్యూహం, ఎత్తుగడ తెలుసన్నారు. దెబ్బకు దెబ్బ తీయడము తెలుసన్నారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి కాలంలో చెల్లిందని కాదీ ఇప్పుడు చెల్లదన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరు మీద రూ. య23 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు కానీ ప్రాజెక్టు పూర్తి చేయలేదని పంగంబండ వద్ద బండ పగలగొట్టేందుకు కేసీఆర్ పదేళ్లలో రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ పదేళ్లపాటు పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా సాధించలేదని దుయ్యబట్టారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే సభకు రాకుండా పారిపోయారని విమర్శించారు.
నా శత్రువును బండకేసి కొట్టాను:
నాకు ఎవరు శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులు ఉంటే వారిని ఎన్నికల్లో ఓడించామన్నారు. నా శత్రువు అనుకున్న వారిని 2023 బండకేసి కొట్టాను. 2024 గుండు సున్న ఇప్పించాను. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో గెలిచాం. ఆయన నడుము విరిగి ఫామ్ హౌస్ లో పడుకుంటే ఆయనను నా శత్రువు అని నేను ఎలా అనుకుంటానన్నారు. మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ కు తాను సవాల్ విసిరానని సీఎం చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన ఇళ్లలోనే వాళ్లు ఓట్లు అడగాలి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలోనే మేం ఓట్లు అడుగుతామని చాలెంజ్ చేశామ్నారు. నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం, పేదరికం, మహిళలకు, విద్యకు అన్యాయం చేసే వారు శత్రువు అన్నారు. పేదరికాన్ని తెలంగాణ సరిహద్దు వరకు తరిమడమే నా లక్ష్యం అన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలమూరును అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.






