- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాకేష్ కు మెరుగైన వైద్యం అందించాలి.. నిమ్స్ వైద్యులకు సీఎం ఆదేశాలు
కండరాల వ్యాది (muscle disease) తో బాధపడుతున్న గూళ్ల రాకేష్ (Gulla Rakesh) కు మెరుగైన వైద్యం (better treatment) అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిమ్స్ ఆసుపత్రి (NIMS Hospital) వైద్యులను (Doctors) ఆదేశించారు.

దిశ, వెబ్ డెస్క్: కండరాల వ్యాది (muscle disease) తో బాధపడుతున్న గూళ్ల రాకేష్ (Gulla Rakesh) కు మెరుగైన వైద్యం (better treatment) అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిమ్స్ ఆసుపత్రి (NIMS Hospital) వైద్యులను (Doctors) ఆదేశించారు. ఓ దిన పత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన సీఎం.. పలు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకునే స్తోమత లేని నిరుపేద యువకుడు గూళ్ల రాకేష్‌ను రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
అంతేగాక సీఎం ఓఎస్డీ (CM's OSD) వేముల శ్రీనివాసులు (Vemula Srinivasulu), రాకేష్‌తోపాటు వారి తల్లిదండ్రులను హైదరాబాద్ (Hyderabad) పిలిపించుకుని మాట్లాడారు. ప్రభుత్వం (Government) అన్ని రకాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా (Assurance) ఇచ్చారు. అనంతరం రాకేష్‌ను నిమ్స్‌లో చేర్పించగా మెడికల్ జెనిటిక్స్, న్యూరాలజీ వైద్యులు డాక్టర్ పి. రంగనాథ్ (Dr.P. Ranganath), సూర్యప్రభ (Surya Prabha) పర్యవేక్షణలో చికిత్స ప్రారంభించారు. కాగా హనుమకొండ జిల్లా (Hanumakonda district) భీమదేవరపల్లి మండలం (Bheemadevarapalli mandal) రంగయ్యపల్లి గ్రామానికి (Rangayyapalli village) చెందిన గూళ్ల రాకేష్ చాలా కాలంగా సూడో మస్య్కులార్ డిస్ట్రోఫీ (pseudo muscular dystrophy) అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు.
ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో నడవలేని పరిస్థితికి వచ్చాడు. రాకేష్‌కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేష్ కుటుంబం ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిత్సహాయ స్థితిలో ఉన్నారని, పత్రికలో కథనం వెలువడింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి.. గూళ్ల రాకేష్ ను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక రాకేష్‌కు ఉచితంగా అవసరమైన చికిత్స (శిాా ఒిాలొచాయొ) ను అందించడమే కాకుండా పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు(Indiramma house) కూడా మంజూరు చేయాలని నిర్ణయించారు.






