- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో సీఎం భేటీ.. కీలక అభ్యర్థన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఇవాళ నోబెల్ (Nobel) గ్రహీత అభిజిత్ బెనర్జీ (Abhijit Banerjee) హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఇవాళ నోబెల్ (Nobel) గ్రహీత అభిజిత్ బెనర్జీ (Abhijit Banerjee) హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైనే ప్రధానంగా చర్చించారు. త్వరలోనే తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు (Telangana Rising Vision Board)ను స్థాపించబోతున్నట్లుగా.. సీఎం రేవంత్ వివరిస్తూనే అభిజిత్ బెనర్జీని కూడా అందులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆదాయ ఉత్పత్తిని పెంచే వ్యూహాలపై విలువైన సలహాలు ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు సీఎం అభ్యర్థనకు అభిజిత్ బెనర్జీ కూడా అంగీకరించారు. త్వరలో స్టార్ట్ చేయబోయే ఫ్యూచర్ సిటీ (Future City)లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాలని సూచించారు. అదేవిధంగా ముఖ్యంగా సంప్రదాయ చేతి వృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని సలహా అభిజిత్ బెనర్జీ, సీఎంకు సలహాలు, సూచనలు చేశారు.






