CM KCR బహిరంగ సభలకు ముహూర్తం ఖరారు!

by GSrikanth |   (  Updated:2022-11-26 08:22:25  IST  )

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్త బహిరంగ సభలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన మొదటి సభ మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నారు.

CM KCR బహిరంగ సభలకు ముహూర్తం ఖరారు!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్త బహిరంగ సభలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన మొదటి సభ మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 7వ తేదీన జగిత్యాలలో సభ ఫిక్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్‌నగర్‌లో సభ నిర్వహించనున్నారు. జగిత్యాల సభకు ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ కవితకు బాధ్యతలు అప్పగించారు. అయితే, అసెంబ్లీ సమావేశాల అనంతరమే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు సిద్ధమవ్వడం చర్చనీయాంశమైంది. డిసెంబర్ మొదటివారం నుంచి వరుసగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ బహిరంగ సభలు అసెంబ్లీ సమావేశాల అనంతరం పెట్టుకున్నారని అనుమానిస్తున్నారు.

Next Story