సీఎం కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం.. భయపడుతున్నారా?

by Disha Web Desk 2 |
సీఎం కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం.. భయపడుతున్నారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ శ్రేణులపై సీఎం కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. భావోద్వేగాలతో కూడిన లేఖను రాశారు. వివిధ అంశాలపై పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ ఓపెన్ లెటర్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కించేందుకే అధినేత సెంటిమెంట్ అస్త్రాన్ని వాడారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఎలక్షన్ టైమ్ లో గుర్తొచ్చామా? అంటూ క్యాడర్ నుంచి సైతం ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తున్నది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా..

రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఇప్పటికే గులాబీ అధిష్టానం పార్టీ లీడర్లకు సూచించింది. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఈ సమ్మేళనాలను కీలకమని భావిస్తున్నది. అయితే గతంలో పార్టీ విషయాలపై సీఎం కేసీఆర్ నేరుగా ప్రెస్ మీట్స్ పెట్టి శ్రేణులను అప్రమత్తం చేసేవారు. ఆ పొగ్రామ్స్ విజయవంతం కోసం క్యాడర్ లో ఉత్సాహం నింపేవారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, మీడియా ముందుకు రాలేకనే కేసీఆర్ ఓపెన్ లెటర్ రాశారని చర్చ జరుగుతున్నది.

క్యాడర్ సాయం కోరేలా..

రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలతో రాజకీయం వేడిక్కింది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పేపర్స్ లీకేజీ వ్యవహారం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పుడు ఏమి జరుగుతున్నదో అనే ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ ఫైర్ యాక్సిడెంట్ విషాదాన్ని నింపింది. ఇంతటి సీరియస్ అంశాలపై ప్రస్తుతం మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇలాంటి అంశాలను ఎదుర్కొనేలా, పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలంటూ పార్టీ శ్రేణుల సాయం కోరుతూ లేఖ రాయడంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం..

బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత ‘తెలంగాణ’ పదం దూరమయ్యిందనే అభిప్రాయం పార్టీ క్యాడర్ లో నెలకొన్నది. పార్టీని ప్రజలు ఓన్ చేసుకోవడం లేదని చర్చ జరుగుతున్నది. ఇదే విషయాన్ని కొందరు సీనియర్ లీడర్లు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. అందుకే ఇంతకాలం ఆ విషయాన్ని పట్టించుకోని కేసీఆర్, తెలంగాణ గడ్డతో బీఆర్ఎస్ కు పేగు బంధం ఉందని చెబుతూ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేశారని టాక్.

Also Read...

10 గంటల్లో 14 ప్రశ్నలు సంధించిన ఈడీ.. వాటిపైనే స్పెషల్ ఫోకస్!



Next Story

Most Viewed