- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సేషనల్ న్యూస్: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి
by Satheesh |
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి సంచలన విజయం సాధించారు. సీఎం కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డిలో పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి రెండవ స్థానంతో సరిపెట్టుకోగా..కేసీఆర్ మూడవ స్థానంలో నిలవడం గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక, కామారెడ్డిలో ఓటమిపాలైన గులాబీ బాస్.. తన సొంత ఇలాకా గజ్వేల్‌లో మాత్రం విజయం దిశగా దూసుకుపోతుండటంతో బీఆర్ఎస్ నేతలు ఊపీరి పీల్చుకుంటున్నారు
Next Story






