- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయానికి చిహ్నం ‘దసరా’: రాష్ట్ర ప్రజలకు CM కేసీఆర్ పండుగ శుభాకాంక్షలు
విజయానికి చిహ్నంగా విజయ దశమి(దసరా)ను దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. దసరాను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విజయానికి చిహ్నంగా విజయ దశమి(దసరా)ను దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. దసరాను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. దసరా కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనం అన్నారు.
శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రత్యేకమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, అగ్రపథాన కొనసాగించేందుకు విజయ దశమి స్ఫూర్తితో అలుపెరుగని పోరాటం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలనీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థించారు.






