- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
సీఎం కేసీఆర్ రిజైన్ చేయాలి: ఈటల
by Disha Web Desk 4 |

X
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై గవర్నర్ ను బీజేపీ నేతల బృందం శనివారం కలిసింది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్సీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 4 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయంటే ప్రభుత్వ పనితనం ఏంటో కనిపిస్తోందన్నారు. ఇది కావాలని చేశారా.. యాదృశ్చికంగా జరిగిందా అనేది సీఎం చెప్పాలన్నారు. పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ సమీక్ష చేయడం లేదన్నారు.
సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. తక్షణమే రద్దయిన పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిటీ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బూర నర్సయ్యగౌడ్, డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డి, రాంచందర్, విఠల్ ఉన్నారు.
Next Story