- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారు: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఒకప్పుడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్, ముంబైలో అడ్డా కూలీ అని.. కానీ ఇప్పుడు ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు వచ్చి పనులు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్, ముంబైలో అడ్డా కూలీ అని.. కానీ ఇప్పుడు ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు వచ్చి పనులు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సం మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల చరిత్రలో ఇవాళ సువర్ణక్షర లిఖితమని అన్నారు.
పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించానని కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా తొలిపాదయాత్ర జోగులాంబ గద్వాల నుంచే చేశానని చెప్పారు. కొందరు నేతల వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇన్నాళ్లు ఆలస్యమైందని మండిపడ్డారు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని గత పాలకులపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంలను ఎవరూ ప్రశ్నించలేదన్నారు.






