- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Yasangi Rice: సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను సూచించారు..

X
దిశ, తెలంగాణ బ్యూరో : యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను సూచించారు. వరికోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్‌లను ఆదేశించారు. తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటినీ ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలన్నారు.
Also Read..
ఆ రెండు అంశాలపైనే స్పెషల్ ఫోకస్..! బీఆర్ఎస్ ఎన్నికల ఎజెండా ఫిక్స్?
Next Story






