బిగ్ బ్రేకింగ్: రైతులకు సీఎం కేసీఆర్ భారీ శుభవార్త

by Satheesh |   (  Updated:2023-03-23 07:32:49  IST  )

రైతులు నిరాశకు గురి కావొద్దని సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు.

బిగ్ బ్రేకింగ్: రైతులకు సీఎం కేసీఆర్ భారీ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులు నిరాశకు గురి కావొద్దని సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఖమ్మంలో పర్యటించిన కేసీఆర్.. నష్టపోయిన పంటలను పరీశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు నిరాశ చెందవద్దని.. ప్రభుత్వం అండగా ఉందని ధైర్యం చెప్పారు.

వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధులను గంటలోనే విడుదల చేస్తామని తెలిపారు. గాలి వానతో రాష్ట్రంలో భారీగా పంట దెబ్బతిన్నదని.. మొత్తం 2,22,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎంత చెప్పినా చెవుటోని ముందు శంఖం ఊదినట్లేనని.. దీంతో ఈ సారి పంట నష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదిక పంపదల్చుకోలేదని చెప్పారు. పంపినా కేంద్రం నుండి ఎలాంటి సహయం రాదని ఆరోపించారు. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒక్కటేనని ఎద్దేవా చేశారు. దేశానికి నూతన వ్యవసాయ విధానం అవసరం ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

Next Story