- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులు అందజేసిన సీఎం కేసీఆర్

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. దేశంలోని వివిధ పార్టీల ముఖ్యమంత్రులను, జాతీయ నేతలను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయమే ప్రత్యేక విమానంలో జార్ఖండ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా 2020లో ఇండో-చైనాలోని గాల్వాన్ లోయలో మరణించిన జార్ఖండ్ సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన చెక్కులను జార్ఖండ్ సీఎంతో కలిసి అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఉన్నారు.
Next Story






