వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీపై CM KCR ఫైర్

by Sathputhe Rajesh |

కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.

వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీపై CM KCR ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు సీఎం కేసీఆర్ వరంగల్‌లో ప్రజా ఆశీర్వద సభలో మంగళవారం మాట్లాడారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదన్నారు. విద్య, వైద్య రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ వరంగల్‌లో నిర్వహించామన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరం అయిన వరంగల్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం బీఆర్ఎస్ పుట్టిందన్నారు. తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్సే అన్నారు. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలన్నారు.

Next Story