- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారిని ఓడించేందుకు రంగంలోకి CM KCR.. ఆ నలుగురే టార్గెట్!
గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన పన్నెండు మందిని ఈసారి అసెంబ్లీలోకి ఎంట్రీ లేకుండా ఓడించాలని పీసీసీ చీఫ్ రేవంత్ పిలుపునివ్వడం బీఆర్ఎస్ అగ్రనేతకు ఆగ్రహం కలిగించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన పన్నెండు మందిని ఈసారి అసెంబ్లీలోకి ఎంట్రీ లేకుండా ఓడించాలని పీసీసీ చీఫ్ రేవంత్ పిలుపునివ్వడం బీఆర్ఎస్ అగ్రనేతకు ఆగ్రహం కలిగించింది. దీంతో రేవంత్‌నే అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా కొడంగల్, కామారెడ్డి సెగ్మెంట్లలో ఓడించేలా ప్లానింగ్ రెడీ అయింది.
ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును ఎన్నికల ప్రచారం చివరి రోజున కొడంగల్ పంపడం వెనక వ్యూహం అదేనని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఖమ్మం జిల్లాలో 10 సీట్లూ గెలిచి కేసీఆర్‌కు చెమటలు పట్టిస్తామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్లకు కౌంటర్‌గా పాలేరులో ఆయన్నే ఓడించడానికి గులాబీ బాస్ స్కెచ్ వేశారు. వ్యక్తిగతంగా విమర్శలు చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సైతం ఓడించేందుకు స్ట్రాటజీని రూపొందించారు.
పక్కా యాక్షన్ ప్లాన్..
ప్రచారం ముగిసిన తర్వాత పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రేవంత్‌రెడ్డి, పొంగులేటి, తుమ్మలతో పాటు గజ్వేల్ బరిలో నిలిచిన ఈటల రాజేందర్‌ను సైతం ఓడించాలని బీఆర్ఎస్ పక్కా ప్రణాళిక రూపొందించింది. ఫామ్‌హౌజ్‌లో బస చేసిన కేసీఆర్ బుధవారం ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల పార్టీ బాధ్యులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు దిశానిర్దేశం చేసినట్లు గులాబీ వర్గాల సమాచారం. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నందున ఇక్కడ వీలైనన్ని సీట్లలో ఓడించడం ద్వారా కట్టడి చేయవచ్చన్నది ప్లాన్. బీఆర్ఎస్ ఓడిపోవడానికి అవకాశాలున్నచోట పోలింగ్ ముగిసేంత వరకూ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ సూచనలు చేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్‌ను కట్టడి చేసేలా..
ఎన్నికల షెడ్యూలు విడుదలైంది మొదలు ప్రచారపర్వం ముగిసేంత వరకు ఏయే సెగ్మెంట్లలో బీఆర్ఎస్ వీక్‌గా ఉన్నదో ఇంటెర్నల్, ఇంటెలిజెన్స్ సర్వేల నివేదికలకు అనుగుణంగా ఆ నియోజకవర్గాల అభ్యర్థులను, ఇన్‌చార్జిలను అలర్ట్ చేశారని సమాచారం. బీజేపీతో పెద్దగా చిక్కుల్లేకపోయినా కాంగ్రెస్ దూకుడును తగ్గించడంపైనే కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. చివరి రోజున అనుసరించే వ్యూహం వారి ఊహకు కూడా అందకూడదని చెప్పినట్టు తెలిసింది.






