- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యూహం మార్చిన కేసీఆర్.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు గులాబీ బాస్ సరికొత్త ప్లాన్..!
ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. రేపటి నుంచి జరిగే బహిరంగ సభల్లో తన సహజశైలిలో కాంగ్రెస్‌పై ఎటాక్ చేసేందుకు

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. రేపటి నుంచి జరిగే బహిరంగ సభల్లో తన సహజశైలిలో కాంగ్రెస్‌పై ఎటాక్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు పాల్గొన్న పబ్లిక్ మీటింగ్స్‌లో ఇంతకాలం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే పాతవాటిని కొనసాగిస్తూ, కొత్త వాటిని సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇస్తూ మాట్లాడారు. కానీ ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదనే అభిప్రాయాలు పార్టీ లీడర్లలో ఉన్నాయి.
పొలిటికల్ ఎటాక్‌తో ప్రచారం
మొదటి దశలో అనుకున్న మేర మైలేజీ రాలేదని సర్వే రిపోర్టుల్లో తేలినట్టు టాక్ ఉంది. దీంతో ఇక నుంచి కేసీఆర్ దూకుడు పెంచుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి, తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ లీడర్లు వ్యవహరించిన తీరును మరింతగా ప్రజలకు వివరించాలని ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఇప్పటివరకు కేసీఆర్ పాల్గొన్న పబ్లిక్ మీటింగ్స్‌తో పార్టీ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో పెరగలేదని గులాబీ లీడర్లే అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ స్పీచ్‌లో రాజకీయ నాయకుడు కనిపించడం లేదని, ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలంటే దూకుడు పెంచక తప్పదని కోరినట్లు తెలుస్తున్నది.
వర్కవుట్ కానీ స్కీమ్స్
ఈనెల 15 నుంచి 18 వరకు సీఎం కేసీఆర్ 7 పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించేందుకు ఆయన ఎక్కువ సమయం కేటాయించారు. అయితే పథకాలపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడలేదని టాక్. ప్రస్తుతం అమలవుతోన్న పలు స్కీమ్స్‌లో కోతలు పెట్టారు. మూడేళ్లుగా 57 ఏళ్లు నిండిన వృద్ధులకు ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దళితబంధు, గృహలక్ష్మి, బీసీ సాయం కింద కేవలం లబ్ధిదారులను మాత్రమే గుర్తించారు. వారంతా తమకు చెక్కులు ఎప్పుడిస్తారని నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పథకాల గురించి చెప్పడం వల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ అవుతుందని అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో కేసీఆర్ తన స్ట్రాటజీని మార్చనున్నట్లు తెలుస్తోంది.






