తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. గన్ పార్కు వద్ద కేసీఆర్ కీలక సందేశం

by Disha Web Desk 2 |
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. గన్ పార్కు వద్ద కేసీఆర్ కీలక సందేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’ను జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో మంగళవారం ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. జూన్ 2న హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ఉత్సవాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో కేసీఆర్ జాతీయ పతాకావిష్కరిస్తారు. దశాబ్ది ఉత్సవ సందేశమిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశమిస్తారు.

= జూన్ 3న ‘తెలంగాణ రైతు దినోత్సవం’. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.

= 4వ తేదీన పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘‘సురక్షా దినోత్సవం’’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించేలా కార్యక్రమాలు.

= 5వ తేదీన ‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పు వివరణ. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం. సింగరేణి సంబురాలు.

= 6న ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’. పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరణ.

= 7న ‘సాగునీటి దినోత్సవం’. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం. హాజరుకానున్న సీఎం కేసీఆర్.

= 8న ‘ఊరూరా చెరువుల పండుగ’. డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు. మత్స్య కారుల వలల ఊరేగింపులు. చెరువు కట్టలపై సభలు. నాయకులు, ప్రజలు కలిసిచెరువు కట్టమీద సహఫంక్తి భోజనాలు.

= 9న ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’. నియోజకవర్గ స్థాయిలో ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు. తెలంగాణ సంక్షేమంలో సాధించిన తీరు, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో సభ.

= 10న ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలు.

= 11న ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు. విజేతలకు బహుమతులు అందజేత.

= 12న ‘తెలంగాణ రన్’. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం.

= 13న ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరణ. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం.

= 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించి వివరణ. హైదరాబాద్ లోని నిమ్స్ లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన, నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన.

= 15 న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం. తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే కార్యక్రమాలు. అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం.

= 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలు.

= 17న తెలంగాణ గిరిజనోత్సవం. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరణ.

=18న ‘‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’’. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు.

= 19న తెలంగాణ హరితోత్సవం. అన్ని గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమం.

= 20న తెలంగాణ విద్యాదినోత్సవం. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలలు ప్రారంభం. 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం. విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహణ.

= 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర మత ప్రార్ధనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు.

= 22న ‘అమరుల సంస్మరణ’. తెలంగాణవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటింపు. అమరుల సంస్మరణ తీర్మానాలు. అమరుల త్యాగాల స్మరణ. హైదరాబాదులో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ. అమరుల స్మారకాన్ని సీఎం ఆవిష్కరణ.

= మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్తూపాల వద్ద శ్రద్ధాంజలి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభకు హాజరు.

ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, శంకర్ నాయక్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రిన్పిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాస్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డిజిపి అంజనీ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రిస్టియానా చోంగ్తు, ఐ అండ్ పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ సంచాలకులు రాజమౌళి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story