అసెంబ్లీని సీఎం బూతులమయం చేసిండు.. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా

by Ramesh Naini |

మూసీపై ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో సమయం ఇవ్వడం లేదని నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.

అసెంబ్లీని సీఎం బూతులమయం చేసిండు.. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. మూసీపై ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో సమయం ఇవ్వడం లేదని నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఈ సందర్బంగా అసెంబ్లీ నుంచి గన్ పార్క్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలినడకన వచ్చి ధర్నా చేపట్టారు. సేవ్ డెమోక్రసీ?, అసెంబ్లీ నడుపుతున్నారా?, సీఎల్పీ మీటింగ్ నడుపుతున్నారా?, స్పీకర్ వైఖరి నశించాలి?, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బూతుల రాజ్యం అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రివా.. స్ట్రీట్ రౌడీవా?

అసెంబ్లీ నుంచి పాదయాత్రగా గన్‌పార్క్ వద్దకు అమరుల స్తూపం వద్ద ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నోటికి హద్దేలేదని, అసెంబ్లీని సీఎం బూతులమయం చేసిండని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రివా.. స్ట్రీట్ రౌడీవా? అని మండిపడ్డారు. కేసీఆర్ మీద చావు మాటలు, అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నావు.. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏకపక్షంగా తెలంగాణ శాసనసభ

తెలంగాణ శాసనసభ అంతా కూడా ఏకపక్షంగా నడపడం పట్ల తీవ్రమైన నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేసినట్లు స్పష్టం చేశారు. శాసనసభను నడుపుతున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఆరోపించారు. మొన్న జరిగిన బీఏసీ మీటింగ్‌కు సీఎం గంటన్న తర్వాత వచ్చారని మండిపడ్డారు. అలాగే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సైతం తప్పుదోవ పట్టించారని అన్నారు. ముఖ్యమంత్రి అడ్డగోలుగా ప్రశ్నోత్తరాల సమయంలో గంటన్నర మాట్లాడారని విమర్శించారు. మూసీ మీద చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్, మరుసటి రోజు ఎన్ని గంటలైన పెట్టాలని సూచించారు.

Next Story