- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు : బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్
సీఎం హోదాలో విదేశాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వెళ్లినపుడు అత్యంత బాధ్యతాయుతంగా మాట్లాడాలని.. కానీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం హోదాలో విదేశాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వెళ్లినపుడు అత్యంత బాధ్యతాయుతంగా మాట్లాడాలని.. కానీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ, రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇనుమడింపజేయాలని.. అలా కాకుండా ఐటీ ఉద్యోగులను సీఎం కించపరిచారని అన్నారు. సంపద సృష్టిలో ఐటీ ఉద్యోగులు పాత్ర కీలకమని.. దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా పది శాతంపైనే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేలా రేవంత్‌రెడ్డి ఫ్యూడల్‌లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఐటీ ఉద్యోగులు చెమటోడుస్తూ దేశ ప్రగతికి తోడ్పడుతున్నారని.. సీఎం దావోస్‌లో చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని ఐటీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. అందరి శ్రమతోనే రేవంత్ సీఎం అయ్యారని అన్నారు. కేటీఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేయలేదని.. ఓ సంస్థ అమెరికా మార్కెటింగ్ విభాగానికి అధిపతిగా పనిచేశారని చెప్పారు. కేటీఆర్ గురించి చులకనగా మాట్లాడుతున్న రేవంత్ ఎక్కడ్నుంచి వచ్చారని ప్రశ్నించారు? పెయింటర్‌గా ఉన్న రేవంత్ సీఎం అయ్యారని తెలిపారు.






