సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన.. కాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 04:36:04  IST  )

సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Malli Bhatti Vikramarka) ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన.. కాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Malli Bhatti Vikramarka) ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో వారు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)ని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అనంతరం హైదరాబాద్ వేదికగా ఈ నెల 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆయనను ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు, కొత్త రేడియల్ రోడ్లు, హై స్పీడ్ రైలు కారిడార్లు వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు, ఆమోదాలపై చర్చించనున్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర విభజన సమయంలో చేసిన హామీలను అమలు చేయాలని కోరనున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం పార్లమెంట్‌లో లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం విక్రమార్క ఆహ్వానించనున్నారు.

Next Story