గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థలు సాధిస్తున్న విజయాలు ఎంతో గర్వకారణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.

గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థలు సాధిస్తున్న విజయాలు ఎంతో గర్వకారణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. రెండు దశాబ్దాల క్రితం ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థలు నేడు అద్భుతమైన ఫలితాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుని విజయాలు సాధించడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్ విద్యా సంస్థలను సమర్థంగా, ఉన్నత ప్రమాణాలతో నడిపిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి, సంస్థల నిర్వాహకులకు, అధ్యాపకులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఎన్టీఆర్ విద్యా సంస్థలు మరిన్ని విజయాలు సాధించి, విద్యా రంగంలో ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా ఈ వివరాలు వెల్లడించారు.

Next Story